Delhi : ఢిల్లీలో బీజేపీదే విజయం
ఢిల్లీ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఢిల్లీ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 48 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆమ్ ఆద్మీపార్టీ కేవలం 22 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. కాంగ్రెస్ బోణీ కొట్టలేదు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను సయితం ఢిల్లీ ఓటర్లు ఓడించారు. బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల్లో బలంగా పనిచేశాయి.
ఢిల్లీని సొంతం చేసుకోవడానికి...
గత కొన్నేళ్లుగా ఢిల్లీలో పాగా వేయడానికి అవసరమైన వ్యూహాలను రెండేళ్ల నుంచే కమలనాధులు ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ అధికారంలో లేకపోవడాన్ని తలవంపులుగా భావించిన మోదీ సర్కార్ దానిని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డింది. మొత్తం మీద ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించిం 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినట్లయింది.