2027 ఆగస్టు 15 నాటికి బుల్లెట్ రైలు
వచ్చే ఏడాది ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు
వచ్చే ఏడాది ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాది ఆగస్టు 15కు పూర్తవుతుందని, దశల వారీగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.
వందేభారత్ స్లీపర్ రైళ్లు...
త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ర్టాలను కలుపుతూ గువాహటి-కోల్‌కతా మధ్య తొలి రైలును ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. బుల్లెట్ రైలు భారత్ లో పరుగులు తీయడానికి పెద్ద సమయం పట్టదని కూడా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.