గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు.
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం బంగ్లా దర్బార్ హాలులో అశోక్ గజపతిరాజు గవర్నర్ గా ప్రమాణస్వీకార కార్యక్రమ ముగిసింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అశోక్ గజపతి రాజు చేత గోవ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంగ్లీష్ లో అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం చేశారు.
టీడీపీ మంత్రులు...
రాజ్ భవన్ లోని బంగ్లా దర్బార్ హాలులో జరిగిన ఈ కార్క్రమానికి గోవా గవర్నర్ ప్రమోద్ సావంత్, గోవా మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు నారా లోకేశ్, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ లతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, నాయకులు కూడా హాజరయ్యారు.