Maoist : నేడు మావోయిస్టు కీలక నేత ఆశన్న లొంగుబాటు?
నిషేధిత మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. నిషేధిత మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది
నిషేధిత మావోయిస్టు పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వసుదేవరావు అలియాస్ అశన్న పోలీసులు ఎదుట లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులపై జరిగిన పలు ఘోర దాడులకు ఆయన ప్రధాన కారణం అని పోలీసులు భావిస్తున్నారు. ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశాలున్నాయని సమాచారం. అదే సమయంలో 70 మంది మావోయిస్టులు కూడా నేడు లొంగిపోనున్నారని తెలిసింది.
చంద్రబాబుపై అలిపిరి దాడిలో...
2003లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద జరిగిన పేలుడు దాడికి అశన్న ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, ఐపీఎస్ అధికారి కె.ఎస్. ఉమేశ్ చంద్ర హత్యల వెనుక కూడా ఆయనే ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. మావోయిస్టు నాయకుడు అశన్న లొంగిపోవచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల మావోయిస్టుల కీలక నేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమానికి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఆశన్న కూడా లొంగిపోతే కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు.