Sabarimala : నేడు మకర జ్యోతి దర్శనం
కేరళలోని శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు
కేరళలోని శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసింది. మకరువిలక్కు ఉత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్యారికేడ్లను పటిష్టంగా నిర్మించారు. శబరిమలలో జ్యోతి దర్శనానికి లక్షలాది మంది అయ్యప్పలు శబరిమలకు చేరుకుంటారు.
శబరిమలకు పోటెత్తిన భక్తులు
ఈరోజుతో అయ్యప్ప మాల నియమాలను ముగించనున్నారు. నలభై రోజుల పాటు అత్యంత నియమ నిష్టలతో పూజలు చేసి నేడు అయ్యప్ప దర్శనానికి వచ్చి స్వామి వారి దర్శనంతో పాటు జ్యోతి దర్శనం కూడా చేసుకుంటారు.జ్యోతి దర్శనం కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందుకోసం భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.