బ్రేకింగ్ : కేరళలో ఐదో మంకీ పాక్స్ కేసు నమోదు

కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. యూఏఈ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ గా వైద్యులు ధృవీకరించారు.

Update: 2022-08-02 07:20 GMT

కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. యూఏఈ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ గా వైద్యులు ధృవీకరించారు. యూఏఈ నుంచి గత నెల 27 నుంచి 30 ఏళ్ల యువకుడు వచ్చాడు. కోజికోడ్ విమానాశ్రయంలో అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో మంకీ పాక్స్ గా తేలడంతో అతనిని ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని శరీరంపై దుద్దుర్లు రావడం, జ్వరం కూడా ఎక్కువగా రావడంతో అతని రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. అందులో మంకీపాక్స్ అని నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసులు ఏడుకు చేరుకున్నాయి.

దేశంలో ఏడుకు చేరిన....
కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదయింది. ఆ తర్వాత నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కేరళలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తొలిసారి మంకీపాక్స్ సోకిన వ్యక్తికి కేరళ వైద్యులు చికిత్స అందించారు. ఆయన కోలుకున్నారు. అతనికి నెగిటివ్ వచ్చింది. దీంతో కొంత ధైర్యం వచ్చిన వైద్య శాఖ మంకీపాక్స్ సోకిన వారి కోసం ప్రత్యేక వార్డులను ప్రారంభించింది. దేశంలో ప్రస్తుతం ఏడు మంకీ పాక్స్ కేసులు నమోదయినట్లయింది.


Tags:    

Similar News