Plane Crash : విషాద ఘటనలో చేతివాటం?

అహ్మదాబాద్ విషాద ఘటనలో మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది

Update: 2025-06-13 03:09 GMT

అహ్మదాబాద్ విషాద ఘటనలో మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, కొందరు వ్యక్తులు వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లోని సేఫ్‌లు, ఇతర వ్యక్తిగత వస్తువులను దోచుకున్నారని అధికారులు తెలిపారు. ప్రతి చోటా ఇలాంటి నీచులు అనేక మంది ఉంటారు. విపత్తు జరిగిన సమయంలోనూ డబ్బులనుదోచుకునే వారు అనేక మంది ఉంటారు.

నగదు, బంగారం కోసం...
అలాంటి ఘటన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరమని వ్యాఖ్యానిస్తున్నారు. మృతదేహాలపై ఉన్నబంగారం కోసం వెదుకుతున్న కొందరయితే, నగదు కోసం మరికొందరు వెదుకుతున్నారు. కొందరు మొబైల్ ఫోన్ల కోసం కూడా ప్రయత్నించారని, ఈ ఘటన పట్ల పౌరులు, అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


Tags:    

Similar News