Encounter : ఛత్తీస్ ఘడ్ లో మరో ఎన్ కౌంటర్ ...కీలక నేత మృతి
ఛత్తీస్ ఘడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది
ఛత్తీస్ ఘడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు కీలక నేత మరణించినట్లు సమాచారం. ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తుంది.
ఇంకా కొనసాగుతున్న...
కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న భాస్కర్ మరణించినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ క్లీన్ హంట్ కొనసాగుతుంది. వరసగా అగ్రనేతలతో పాటు వందల సంఖ్యలో మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో మరణిస్తున్నారు. మృతులు ఎక్కువ సంఖ్యలో మరణించినట్లు తెలుస్తుంది.