ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. ఒక నైజీరియన్ కు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు

Update: 2022-08-02 03:49 GMT

దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. ఒక నైజీరియన్ కు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఢిల్లీలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదయినట్లయింది. దేశంలో మంకీపాక్స్ వరసగా కలకలం రేపుతుంది. కేరళలో బయటపడిన తొలి కేసు నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఊరట కల్గించే అంశమే అయినా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ దేశంలో...
ఇప్పటి వరకూ దేశంలో ఆరుగురు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో రెండు, కేరళలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. సాధారణంగా విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి మంకీపాక్స్ సోకుతుంది. కానీ తాజాగా ఢిల్లీలో మంకీపాక్స్ సోకిన నైజీరియన్ ఎటువంటి విదేశీ పర్యటనలను చేయలేదని అధికారులు తెలిపారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుండటం, శరీరంపై దుద్దుర్లు రావడంతో నైజీరియన్ రక్తనమూనాలను సేకరించి పూనే ల్యాబ్ కు పంపారు. అందిన నివేదిక ప్రకారం మంకీపాక్స్ సోకినట్లు నిర్ధారణ అయింది.


Tags:    

Similar News