Earth Quake : హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. చంబా జిల్లాలో ఒకేరోజు రెండు సార్లు వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Update: 2025-08-20 07:40 GMT

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. చంబా జిల్లాలో ఒకేరోజు రెండు సార్లు వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.3, 3.5 గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

ప్రజలు భయాందోళనలతో...
అయితే ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు కోరారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వెల్లడినేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు చంబా జిల్లాలో మొదటిసారి భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News