Plane Crash : బీజే మెడికల్ హాస్టల్ ఇదే... భోజనం చేస్తుండగా
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కాసేపటికే కూలింది.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కాసేపటికే కూలింది. విమానం బైరాంజీ జీజీభోయ్ మెడికల్ కళాశాల మెస్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయం లో భోజన సమయం కావడంతో ప్లేట్స్ లో సగం తిన్న అన్నం కనిపిస్తుంది.ఇది అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్ కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆ సమయంలో అక్కడ భోజనం చేస్తూ కనిపించారు.
అందరూ ఆనందంగా...
అందరూ ఆనందంగా సన్నిహితులతో ముచ్చట్లు చేస్తూ భోజనం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనం జరగడంతో వారు చెల్లా చెదురయ్యారు. కొందరు మరణించగా, మరకొందరు తీవ్ర గాయాలయ్యాయి. అందులో యాభై మంది మెడికోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా మెడికోల హాస్టల్ లో భోజనం చేస్తుండగా విమానం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.