నేడు ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు

నేడు ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 జరగనుంది.

Update: 2026-02-19 04:12 GMT

నేడు ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 జరగనుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయన్న దానిపై మోదీ ప్రసంగంచనున్నారు.

మూడు రోజుల పాటు...
ఈ సదస్సులో ప్రజలు, ప్రపంచం, అభివృద్ధి ప్రధాన అంశాలుగా చర్చించనున్నారు. సదస్సుకు ప్రపంచంలోని ఇరవైకిపైగా దేశాలఅధినేతలు, 60మంది మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు 500 మందికిపైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులు హాజరు కానున్నారు. ఏఐ సదస్సు జరుగుతుండటంతో ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలు చర్యలు తీసుకున్నారు.


Tags:    

Similar News