ఆపరేషన్ సింధూర్ పై మళ్లీ స్పందించిన ట్రంప్

ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు.

Update: 2025-05-08 03:47 GMT

Donald trump

ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. భారత్-పాక్ లతో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.సమస్యను పరిష్కరించేందుకు చేతనైనా సాయం చేస్తానని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఉగ్రవాదులను అణిచివేసే చర్యలను ఏ దేశమైనా సమర్థించాల్సిందేనని ట్రంప్ తెలిపారు.

దాడి భయంకరమైనదని...
పాక్ పై భారత్ దాడి చాలా భయంకరమైనదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో భారత్ కేవలం ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడి చేసిందని ఆయన తెలిపారు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వకుండా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ శాంతికోసం ప్రయత్నించాలని కోరారు.


Tags:    

Similar News