నిరుద్యోగులకు అలెర్ట్...ఎన్నిఉద్యోగాలో.. రేపు ఆఖరి గడువు

నిరుద్యోగులకు అలెర్ట్. 32,438 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి రేపు ఆఖరి గడువు

Update: 2025-03-01 07:29 GMT

నిరుద్యోగులకు అలెర్ట్. 32,438 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి రేపు ఆఖరి గడువు. రైల్వే శాఖ గ్రూపు డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. నిజానికి గత నెల 22వ తేదీనే గడువు ముగిసింది. అయితే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు మరో ఏడు రోజులు పొడగించింది.

మరిన్ని వివరాలకు...
మార్చి 4 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకూ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పరీక్షకు హాజరవ్వాలంటే అర్హత పదో తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మాత్రమే. అయితే రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు వయోపరిమితిలోనూ సడలింపు ఉంటుంది. సీబీటీ, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. మరిన్ని వివరాలకు http://www.rrbapply.gov.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు.


Tags:    

Similar News