Sabarimala : శబరిమలకు వెళ్లే వారికి అలెర్ట్

శబరిమలకు వెళ్లే భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక సూచనలు చేసింది

Update: 2025-11-17 07:55 GMT

శబరిమలకు వెళ్లే భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక సూచనలు చేసింది. అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళ రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ కేసులు ఉన్నందున భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

స్నానం చేసే సమయంలో...
దీంతో స్నానం చేసేటప్పుడు నీరు ముక్కులోకి పోకుండా చూసుకోవాలని, వేడి చేసిన నీళ్లనే తాగాలని తెలిపింది. అవసరమైతే హెల్ప్ లైన్ నంబర్ 04735203232 ను సంప్రదించమని కోరింది. ఆహారం తీసుకునే విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వ్యాధులు ప్రబలే అవకాశముందని హెచ్చరించింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.


Tags:    

Similar News