Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది.

Update: 2025-10-18 08:02 GMT

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ వాయుకాలుష్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల పాయింట్లకు చేరిందని తెలిపారు. దీంతో ఢిల్లీ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ లో వ్యర్థాలను దహనం చేయడంతో ఈ వాయుకాలుష్య తీవ్రత మరింత పెరిగిందని అంటున్నారు. ఆనంద్ విహార్, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్ ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యం పెరిగింది.

వ్యాధుల బారిన...
కాలుష్య ప్రభావంతో ఢిల్లీ వాసులు అనేక ఆరోగ్య కరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రాకపోవడమే మంచిదని, ఒకవేళ వచ్చినా మాస్క్ లు ధరించి రావాలని అధికారులు కోరుతన్నారు. ఎక్కువగా కళ్ల మంటలు, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. దీపావళి పండగ దగ్గర పడటంతో మరింతగా వాయు కాలుష్యం పెరిగే అవకాశముందని అంటున్నారు.


Tags:    

Similar News