Delhi : ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతుంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాతావరణ కాలుష్యం పెరిగిందని అధికారులు సయితం చెబుతున్నారు. ఢిల్లీలో ప్రజలు ఖచ్చితంగా మాస్క్ లు ధరించి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రారంభించింది.
ప్రమాదకర స్థాయికి...
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా కొనసాగుతోంది. నగరంలో సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 268 పాయింట్లుగా నమోదైంది. ముఖ్యంగా, జహంగీర్‌పురి ప్రాంతంలో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ అత్యధికంగా 324 పాయింట్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉడాలని వైద్యులు సూచిస్తున్నారు.