Breaking : లంచ్ చేస్తుండగానే కూలిన విమానం ..20 మంది మెడికోల మృతి

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఇరవై మంది మెడికోలు మరణించారు.

Update: 2025-06-12 10:53 GMT

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది.కూలిన విమానం ఒక మెడికల్ కళాశాలపై పడిందని చెబుతున్నారు. ఆ సమయంలో మెడికోలు భోజనం చేస్తున్నారు. మొత్తం ఇరవై మంది మెడికోలు భోజనం చేస్తుండగా విమానం కుప్పకూలడంతో ఆ భవనం మొత్తం కూలిపోయింది. శిధిలాలు మిగిలాయి. మధ్యాహ్నం కావడంతో మెడికోలు అందరూ భోజనానికి క్యాంటిన్ లో ఉన్నారు. ఆ సమయంలో విమానం కూలడంతో శిధిలాల కింద పడి ఆ భవనంలో ఉన్న ఇరవై మందిమెడికోలు మరణించారని ప్రాధమికంగా అందుతున్నసమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇరవై మందికి పైగా మెడికోలు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇంకా అనేక మంది మెడికోలు గాయడపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

169 మంది భారతీయులు...
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ అయిన కొద్ది సమయానికే మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అయితే ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు.కూలిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. మొత్తం సిబ్బందితో కలిసి 256 మంది వరకూ ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బిట్రన్ దేశానికి చెందిన వారు ఉన్నారని బోర్డింగ్ పాస్ ల ద్వారా తెలుస్తోంది. ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ వాసికిచెందిన వారు కూడా ఉన్నారు. సివిల్ ఆసుపత్రికి సమీపంలోనే విమానం కూలిపోయింది. విమానంలో పన్నెండు మంది సిబ్బంది కూడా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో సహాయక బృందాలు చేరుకుని చర్యలు ప్రారంభించాయి.
రెండు హాస్టల్స్ భవనాలపై...
అంతర్జాతీయ విమానం కావడంతో పాటు, అనుభవమున్న పైలట్లు ఇందులో ఉన్నారు. అయితే సాంకేతికలోపం కారణంగానే విమానం కూలిందని చెప్పారు. మే డే కాల్ ఏటీసీ కి వచ్చిందని, ఏటీసీకి రావడంతో వెంటనే తమకు సాయం అందించాలని కోరిన వెంటనే పైలట్ తో సంబంధాలు ఏటీసీకి కట్ అయినట్లు కూడా చెబుతున్నారు. హాస్పిటల్ మెడికల్ కళాశాలలకు చెందిన రెండు భవనాలపైన ఈ విమానం కూలిపోవడంతో అక్కడ లంచ్ కు కూర్చున్న ఇరవై మంది నోట్లో ఆహారం పెట్టుకుని ప్రాణాలు వదిలినట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వారు ఎంతమంది మరణించారన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు తెలియాల్సి ఉంది. ఇటు విమానంలో 264 మందితో పాటు అటు జనావాసాల్లో పడటంతో ఎక్కువ మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇరవై మంది మెడికోలు మరణించారని అధికారికంగా ప్రకటించారు. 


Tags:    

Similar News