Big Breaking : అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. భారీగా ప్రాణ నష్టం?

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది

Update: 2025-06-12 08:51 GMT

అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది సమయానికే మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అయితే ఈ విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అంతర్జాతీయ విమానం కావడంతో భారీ ప్రాణనష్టం జరిగే అవకాశాలున్నాయంటున్నారు.

గాయపడిన వారికి...
విమానం కూలిన సమాచారం తెలిసిన వెంటనే సంఘటన ప్రాంతానికి మూడు ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అహ్మాదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, కొందరు గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై విమానం కూలి పోవడంతో పెద్దయెత్తున ప్రాణ నష్టం జరిగినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.



Tags:    

Similar News