Plane Crash : అహ్మదాబాద్ లో బ్లాక్ బాక్స్ లభ్యం

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభ్యమయింది.

Update: 2025-06-13 11:46 GMT

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభ్యమయింది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ను గుర్తించిన అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లోని ల్యాబ్ లలో బ్లాక్ బాక్స్ ను విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో రెండు భాగాలుంటాయని, సీవీఆర్, ఎఫ్.డి.ఆర్. లుగారెండు విభాగాలను విశ్లేషించనున్నారు సీవీఆర్ లో పైలట్, కో పైలట్ లు మాట్లాడుకునే విషయాలుంటాయనిచెబుతున్నారు.

అన్ని వివరాలు...
బ్లాక్ బాక్స్ లోచివరి రెండు గంటల ఆడియో ఉంటుందని చెబుతున్నారు. విమానడేటా రికార్డింగ్ లో విమానం, వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు వంటి విషయాలు విశ్లేషణ ద్వారావెల్లడవుతాయనిచెబుతున్నారు. బాక్ బాక్స్ ను శిధిలాల కింద స్వాధీనం చేసుకున్న అధికారులు దానిని విశ్లేషించేందుకు తీసుకెళ్లనున్నారు. ప్రమాదానికి గల కారణాలు దీనికి తెలిసే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News