Plane Crash : మళ్లీ మాట్లాడలేనేమో.. అక్కతో చివరి మాటలు
అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఎయిర్ హోస్టెస్ నగాన్తోయ్ శర్మ మరణించారు
అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఎయిర్ హోస్టెస్ నగాన్తోయ్ శర్మ మరణించారు. ఆమె చివరి సారిగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇరవై ఒక్క ఏళ్ల నగాన్తోయ్ శర్మ ప్రమాదం జరిగిన విమానంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్నారు. ఆమె ప్రమాదం జరగడానికి ముందు చివరి సారి తన సోదరికి ఫోన్ చేసి మాట్లాడారు.
బయలుదేరడానికి ముందు...
ఎయిర్ హోస్టెస్ లాస్ట్ కాల్ అహ్మదాబాద్ విమానంలో ఎయిర్హోస్టెస్ నగాన్తోయ్ శర్మ కథ వింటే కళ్లు చెమ్మగిల్లుతాయి. మణిపూర్ కు చెందిన ఈమె 19 ఏళ్లకే ఎయిర్ ఇండియాలో చేరారు. కేవలం రెండేళ్లకే అదే విమానంలో ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తోంది. ఉదయం 11.30 గం.కు తన అక్కకు ఫోన్ చేసి లండన్ వెళ్తున్నానని చెప్పారు. 'మళ్లీ మాట్లాడలేనేమో.. జూన్ 15న తిరిగి వస్తాను' అని చెప్పారట. ఆ మాటే నిజమైంది.