భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై అసద్ సంచలన వ్యాఖ్యలు

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-09-14 04:10 GMT

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహాల్గామ్ దాడిలో అమాయకులను చంపిన వారికి మద్దతుగా నిలిచిన దేశంతో ఆటలేంటి అని ప్రశ్నించారు. దాదాపు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పోయాయని, ఆ ప్రాణాల కంటే ఒక మ్యాచ్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయం ముఖ్యమా? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

ప్రాణాలకంటే...
పహాల్గామ్ దాడిలో భారత పౌరులను మతం అడిగి మరీ కాల్చి చంపిన పాకిస్థాన్ తో క్రికెట్ ఆడవద్దని చెప్పే శక్తి మీకు లేదా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాణాల కంటే ఆటలు ముఖ్యమా? అని అసదుద్దీన్ నిలదీశారు. కాగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు దుబాయ్ లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News