270 ఏళ్ల తర్వాత అనంత పద్మనాభస్వామి ఆలయంలో!!

కేరళలోని ప్రఖ్యాత అనంతపద్మనాభస్వామి ఆలయంలో సుమారు 270 ఏళ్ల తర్వాత జరిగిన మహా కుంభాభిషేకం నిర్వహించారు.

Update: 2025-06-09 09:30 GMT

కేరళలోని ప్రఖ్యాత అనంతపద్మనాభస్వామి ఆలయంలో సుమారు 270 ఏళ్ల తర్వాత జరిగిన మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం 300 ఏళ్ల క్రితం నాటి విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలశాన్ని ప్రతిష్ఠించారు.

2017లో సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కొవిడ్ పరిస్థితుల కారణంగా ముందుకు సాగలేదు. అనంతరం 2021 నుంచి దశలవారీగా పలు పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. శతాబ్దాల తర్వాత ఆలయంలో సమగ్ర పునరుద్ధరణ, సంబంధిత ఆచారాలు నిర్వహించారు. ట్రావెన్‌కోర్ రాజకుటుంబం ప్రస్తుత అధిపతి మూలం తిరునాల్ రామ వర్మ, ఆ రాజకుటుంబ సభ్యుల సమక్షంలో ఈ క్రతువులు జరిగాయి.

Tags:    

Similar News