బెంగళూరు తొక్కిసలాట ఘటనలో కొనసాగుతున్న చర్యలు
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడంతో బెంగళూరు నగరంలో విక్టరీ పరేడ్ నిర్వహించేందుకు సిద్ధమయింది. అయితే చిన్న స్వామి స్టేడియానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కావడంతో తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారు.
ఇంటలిజెన్స్ చీఫ్ ను...
దీంతో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పోలీసు వైఫల్యం కారణంగా కొందరు పోలీసు అధికారులపై వేటు వేసింది. ఇక తాజాగా కర్ణాటక ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ ను కూడా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హేమంత్‌తో పాటు పలువురు పోలీస్ అధికారుల బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. తొక్కిసలాట ఘటనపై కర్నాటక సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే బెంగళూరు పోలీస్ కమిషనర్ తో సహా పలువురిపై సస్పెన్షన్ వేటు వేసింది.