కుప్పకూలిన యుద్ధ విమానం
భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది.
భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కూలిపోయింది. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన భనుడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఐఏఎఫ్ జాగ్వార్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఇద్దరు పైలట్లు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారని భారత వాయుసేన వెల్లడించింది. ఆ యుద్ధ విమానం సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. కూలిపోవడానికి ముందు అది నియంత్రణ కోల్పోయింది. ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు.