నదిలో 317 మొబైల్ ఫోన్స్.. ఎక్కడికి పంపుతున్నారంటే

Update: 2022-10-09 13:50 GMT

ప్లాస్టిక్ కంటైనర్‌లలో మొబైల్ ఫోన్‌లను బంగ్లాదేశ్ కు పాగ్లా నదిలో తరలిస్తుండడాన్ని సరిహద్దు భద్రతా దళాలు (బిఎస్‌ఎఫ్) గుర్తించాయి. శనివారం నాడు భద్రతా దళాలు వీటిని స్వాధీనం చేసుకున్నాయి. సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ పరిధిలోని 70వ బెటాలియన్ దళాలు సాయంత్రం 5:30 గంటల సమయంలో 300 ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. పాగ్లా నదిలో అరటి కాండాలకు కట్టిన కొన్ని ప్లాస్టిక్ కంటైనర్లను సరిహద్దు ఔట్‌పోస్ట్ లోధియాలోని సైనికులు గమనించారని BSF ఒక ప్రకటనలో తెలిపింది. అప్రమత్తమైన జవాన్లు వెంటనే నదిలో ఉన్న కంటైనర్లను బయటకు తీశారు. వాటిని తెరిచి చూడగా వారి నుంచి వివిధ కంపెనీలకు చెందిన 317 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర సుమారు రూ. 38,83,000గా అంచనా వేయబడింది. ఫోన్‌లను స్థానిక పోలీసులకు అప్పగించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు భద్రతా దళం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని 70వ బెటాలియన్ కమాండింగ్ అధికారి తెలిపారు. తాము తీసుకుంటున్న చర్యల వలన స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, చాలా మందిని పట్టుకుని చట్టం ముందు నిలబెడుతూ ఉన్నామని తెలిపారు.


Tags:    

Similar News