మన పక్క రాష్ట్రానికి పాకిన టమోటో ఫ్లూ.. 26 మంది చిన్నారుల్లో..!

టమోటో ఫ్లూగా పేరు పొందిన వైరస్‌…పేగు సంబంధిత వైరస్ కారణంగా సోకే అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నారులకు ఇది వ్యాపిస్తుంది.

Update: 2022-05-25 02:58 GMT

ఒడిశాలో మొత్తం 26 మంది చిన్నారులు హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ (HFMD)తో బాధపడుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య అధికారులు తెలిపారు. దీన్ని 'టమోటో ఫ్లూ' అని పిలుస్తారు. ఈ వ్యాధి పేగు వైరస్‌ల వల్ల వస్తుంది. 26 మంది చిన్నారులకు సోకింది. అయితే ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు. టమోటో ఫ్లూగా పేరు పొందిన వైరస్‌…పేగు సంబంధిత వైరస్ కారణంగా సోకే అంటువ్యాధి. ముఖ్యంగా చిన్నారులకు ఇది వ్యాపిస్తుంది. వయోజనులకు దీన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల వారిపై ఈ వ్యాధి ప్రభావం చూపదు.

ఇది ఎక్కువగా పిల్లలలో వస్తుంది. పెద్దవారిలో ఈ వ్యాధి చాలా అరుదని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వైరస్ నుండి రక్షించడానికి తగినంత బలమైన రోగనిరోధక వ్యవస్థలను పెద్దలు కలిగి ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చాలా సందర్భాలలో, వైరల్ అనారోగ్యం జ్వరం, నోటిలో నొప్పితో కూడిన పుండ్లు, చేతులు, పాదాలు, పిరుదులపై బొబ్బలతో దద్దుర్లు వంటి లక్షణాలను కలిగిస్తుంది.
భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రంలో 36 నమూనాలను సేకరించి పరీక్షించగా, 26 మందికి పాజిటివ్‌గా తేలిందని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ బిజయ్ మహపాత్ర విలేకరులకు తెలిపారు. HFMD- సోకిన పిల్లలలో 19 మంది భువనేశ్వర్‌కు చెందినవారు, ముగ్గురు పూరీకి చెందినవారు. ఇద్దరు కటక్ కు చెందిన వారని మహపాత్ర తెలిపారు. " ఇన్ఫెక్షన్ సోకిన వారు 1-9 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఐదు-ఏడు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని కోరారు" అని అధికారి తెలిపారు. రోగుల పరిస్థితి విషమంగా లేదని, వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో కేరళలోని కొల్లం జిల్లా నుండి 80కి పైగా హెచ్‌ఎఫ్‌ఎమ్‌డి కేసులు నమోదయ్యాయి, దీంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో తమ నిఘాను పెంచాయి. పిల్లలలో ఏవైనా లక్షణాలు కనపడితే వైద్యుడిని సంప్రదించాలని అధికారులు తెలిపారు. పిల్లలు తమ బొబ్బలను గీసుకోవడానికి అనుమతించకండి. పిల్లలకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. పరిశుభ్రత పాటించాలి.. చల్లటి నీళ్లలో స్నానం చేయించాలి. టొమాటో వైరస్ ఇతర ఫ్లూ మాదిరిగానే అంటువ్యాధి. ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి, బాధిత వ్యక్తిని ఒంటరిగా, దూరంగా ఉంచాలి. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల పాత్రలు, బట్టలు, ఇతర వస్తువులను శుభ్రంగా ఉంచాలి.


Tags:    

Similar News