16 అడుగుల కింగ్ కోబ్రా బెదరని రోహిణి
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రాను కేరళకు చెందిన ఒక అటవీశాఖ అధికారిణి ఎంతో సునాయాసంగా పట్టుకున్నారు
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రాను కేరళకు చెందిన ఒక అటవీశాఖ అధికారిణి ఎంతో సునాయాసంగా పట్టుకున్నారు. తిరువనంతపురంలోని పెప్పర ప్రాంతంలో భారీ కింగ్ కోబ్రాను స్థానికులు గుర్తించారు. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పరుథిపల్లి రేంజ్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక కర్ర సహాయంతో ఎంతో నైపుణ్యంగా కోబ్రాను ఓ సంచిలో బంధించారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. రోషిణి 500కు పైగా పాములను సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.