Bellary : బళ్లారిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
బళ్లారిలో నేడు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది.
బళ్లారిలో నేడు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. ఈరోజు వాల్మీకి విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా బ్యానర్లు కడుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి కాల్పుల్లో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో నేడు బళ్లారిలో జరగాల్సిన వాల్మీకి విగ్రహావిష్కరణను వాయిదా వేశారు. మరొకవైపు బళ్లారిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
144వ సెక్షన్ కొనసాగింపు...
బళ్లారి పట్టణంలో పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ప్రధాన నేతల ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తును పెంచారు. మరొకవైపు పట్టణమంతా 144వ సెక్షన్ కొనసాగిస్తున్నట్లు బళ్లారి పోలీసులు ప్రకటించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బళ్లారి పోలీసులతో పాటు అదనపు పోలీసు బలగాలు కూడా బళ్లారి నగరంలో మొహరించాయి.