ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్య.. మంత్రి సమీక్ష

దేశంలోని అనేక విమానాశ్రయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష చేస్తున్నారు

Update: 2025-11-08 07:37 GMT

దేశంలోని అనేక విమానాశ్రయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష చేస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలు తలెత్తి అనేక విమానాలు ఆలస్యంగా నడిచాయి. అనేక విమానాల రాకపోకలు రద్దయ్యాయి. దీంతో నిన్న రాత్రి దాదాపు పన్నెండు గంటల వరకూ ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉండి అధికారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. దీశంలో పలు చోట్ల విమానాశ్రయాల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయని గుర్తించారు.

ఉదయం నుంచి...
బెంగళూరు నుంచి ఢిల్లీ చేరకున్న మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉదయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పాటు ముంబయి వంటి నగరంలోనూ ఇబ్బందులు వచ్చాయి. దీనిపై రామ్మోహన్ నాయుడు ఎయిర్ పోర్టు అథారిటీతో పాటు, డీజీసీఏ, ఎయిర్ పోర్టు అధికారులతో సమావేశమయ్యారు. విమానాలు ఆలస్యమవుతుండటంతో ప్రయాణికులు అసహానికి గురవుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై అధికారులతో చర్చిస్తున్నారు.


Tags:    

Similar News