కర్ణాటక ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిహారం

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Update: 2025-12-25 04:57 GMT

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఈరోజు తెల్లవారు జామున బస్సును లారీ ఢీకొట్టడంతో దాదాపు పద్దెనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే మృతుల కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఒక్కొక్కరికి రెండు లక్షలు...
మరొకవైపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు పరిహారం ఇస్తామని ప్రధాని తెలిపారు. రోడ్డు ప్రమాదం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మోదీ తన సానుభూతిని తెలియజేశారు.


Tags:    

Similar News