Narendra Modi : నేడు ఉద్యోగార్థులకు నియామకపత్రాలు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందచేయనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలను అందచేయనున్నారు. ఢిల్లీలో జరగనున్న పద్దెనిమిదవ రోజ్ గార్ మేళా లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాల్గొంటారు. ఉదయం పదకొండు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.
దేశ వ్యాప్తంగా...
ఈ కార్యక్రమంలో మొత్తం అరవై ఒక్క వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అందచేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న నలభై ఐదు చోట్ల రోజ్ గార్ మేళాలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఉద్యోగాలను పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించ నున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు.