Kerala : కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం

కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సబ్బులను హైకోర్టు నిషేధించింది.

Update: 2025-11-08 02:32 GMT

కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సబ్బులను హైకోర్టు నిషేధించింది. పంబ నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్న తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డివిజన్ బెంచ్ ఈ చర్య తీసుకుంది. శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సాచెట్లను విక్రయించడంతో పాటు ఉపయోగించడాన్ని హైకోర్టు నిషేధించింది. పంబ నదితో సహా పంబ నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్న తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డివిజన్ బెంచ్ ఈ చర్య తీసుకుంది. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది.

శబరిమల వెళ్లే వారు...
షాంపూ సాచెట్లతో పాటు , పంబ , సన్నిధానం మరియు ఎరుమేలిలలో రసాయన కుంకుమ అమ్మకాలను కూడా నిషేధించారు. ఈ ఉత్పత్తులు పర్యావరణానికి హానికరం అనే కారణంతో కోర్టు ఈ చర్య తీసుకుంది. మండల, మకరవిళక్కు సీజన్ ఈనెల 16 వ తేదీ నుండి ప్రారంభం కానున్నందున ఈ నిషేధాలు వచ్చాయి. ఘన వ్యర్థాలను పారవేయకుండా నిరోధించడానికి కఠినమైన తనిఖీలు నిర్వహించాలని కోర్టు ఎరుమేలి గ్రామ పంచాయతీని కూడా ఆదేశించింది. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.


Tags:    

Similar News