Bihar : బీహార్ లో నేడు తొలి విడత ఎన్నికలు

నేడు బీహార్ తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.

Update: 2025-11-06 01:55 GMT

నేడు బీహార్ తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బీహార్ లో మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమయింది. ఈరోజు 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం పద్దెనిమిది జిల్లాల పరిధిలో జరుగుతున్న తొలి దశ ఎన్నికల్లో 1,314 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును నేడు వినియోగించుకోనున్నారు.

అన్ని ఏర్పాట్లు...
తొలి విడత ఎన్నిలకు సంబంధించిన ఏర్పాట్లను అన్నింటినీ పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ యంత్రాంగంమొతకతం 45.341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండి కూటమి, ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది. ఈ విడతలో ఇండి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పాటు పలువురు కీలక నేతలు బరిలో ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News