India : నేడు వందేమాతరం 150వ వార్షికోత్సవాలు

వందేమాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవం నేటి నుంచి ప్రారంభం కానుంది

Update: 2025-11-07 02:13 GMT

వందేమాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవం నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఏడాది పాటు వందేమాతరం వార్షికోత్సవాలను నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రకు గుర్తుగా పోస్టల్ స్టాంప్ తో పాటు స్మారక నాణేన్ని కూడా ఆవిష్కరించనున్నారు.

ఏడాది పొడవునా...
అలాగే దేశ వ్యాప్తంగా నేడు 9.50 గంటలకు బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించనున్నారు. ఈ ఏడాదిని కేంద్ర ప్రభుత్వం 150 ఏళ్ల వందేమాతరంగా పరిగణించింది. ఈరోజు నుంచి వచ్చే ఏడాది నవంబరు 7వ తేదీ వరకూ వందేమాతరం జాతీయ గేయం సంస్కరణోత్సవాలను జరపాలని నిర్ణయించారు.


Tags:    

Similar News