యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ 10 లో కబాలి ట్రైలర్

Update: 2016-12-08 05:44 GMT

సినిమా ఆశించినంత గొప్ప విజయాన్ని సాధించలేకపోయింది గానీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ట్రైలర్.. యూట్యూబ్ ట్రెండింగ్ లో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. 2016 సంవత్సరంలో ట్రెండింగ్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, బాలీవుడ్ ట్రైలర్ ల టాప్ 10 జాబితాను యూట్యూబ్ బుధవారం నాడు విడుదల చేసింది.

మూవీ ట్రైలర్ లలో రజనీకాంత్ కబాలి అగ్రస్థానంలో నిలవడం విశేషం. సల్మాన్ ఖాన్ చేస్తున్న కపిల్ శర్మ షో ఈ ఏడాది టాప్ వీడియో గా నిలిచింది.

నోట్లరద్దు దెబ్బకు అనుబంధంగా జరిగిన ప్రచారాల ప్రభావం యూట్యూబ్ లో కూడా కనిపించడం విశేషం. కొత్త 2000 రూపాయల నోట్లలో జీపీఎస్ చిప్ ఎంబెడ్ చేసి ఉందన్నట్లుగా చూపించే వీడియో కూడా.. ఈ ఏటి టాప్ టెన్ వీడియోల్లో ఒకటిగా ఉండడం విశేషం.

మ్యూజిక్ వీడియోల విషయానికి వస్తే ‘కాలా ఛస్మా’ వీడియో 4.5 కోట్ల వీక్షకులతో టాప్ పొజిషన్ లో ఉంది. మొత్తంగా కలిపి చూస్తే టాప్ 10 వీడియోలన్నిటికీ కలిపి ఏడు కోట్ల వ్యూస్ ఉన్నాయి. వీటిని అందిస్తున్న ఛానళ్లకు నాలుగున్నర కోట్ల మంది సబ్‌స్ర్కయిబర్లు ఉన్నారని యూట్యూబ్ ప్రతినిధి సత్య రాఘవన్ తమ బ్లాగ్ పోస్టులో తెలిపారు.

Similar News