ధ్రువ థియేటర్లలో ఖైదీ నెం.150 టీజర్ విడుదల

Update: 2016-12-05 16:10 GMT

మెగాస్టార్ ముద్ర లేకుండా.. చిరంజీవి వెండితెర మీద మెరవకుండా తన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఉద్దేశం రాంచరణ్ కు లేనట్లుగా ఉంది. చిరంజీవి ఏ పాత్రా చేయకుండా చరణ్ ధ్రువ చిత్రం రూపొందినప్పటికీ.. అది విడుదల సమయానికి మెగా మెరుపులు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి. ధ్రువ చిత్రంతో పాటూ.. రాంచరణ్ నిర్మాతగా రూపొందిస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్రం టీజర్ ను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నిజానికి తన ధ్రువ చిత్రం టీజర్ ను కూడా ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయాలని రాంచరణ్ అనుకున్నారు. అప్పట్లో ఆ మేరకు ప్రకటించారు కూడా. కానీ అవేమీ సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎటూ విడుదల అవుతున్నది తన చిత్రమే గనుక.. దానితో పాటూ నాన్న హీరోగా చేస్తున్న చిత్రం టీజర్ ను కూడా చూపించబోతున్నారు.

ఖైదీ నెంబర్ 150 ... మెగాస్టార్ చిరంజీవి ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. వివి వినాయక్ దర్శకత్వంలో చేస్తున్న కమ్ బ్యాక్ చిత్రంగా ఉంది. తమిళ చిత్రం కత్తికి రీమేక్ గా రూపొందుతున్న ఇందులో కాజల్ అగర్వాల్, తరుణ్ అరోరాలు కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతి విడుదలగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Similar News