గతం ప్రస్తావిస్తే భగ్గుమంటున్న కథానాయిక

Update: 2016-12-05 10:30 GMT

వెండితెర పై మెరిసి గుర్తింపు సాధించుకోవాలని అందరికి ఆశ ఉంటుంది కానీ ఆ అవకాశం చాలా కొద్దీ మందికి మాత్రమే వస్తుంది. ఆలా అవకాశం సంపాదించి వెండితెరపై అగ్ర స్థానానికి చేరిన అనేక మంది తారలకు రకరకాల బ్యాక్ గ్రౌండ్ వారికి దోహద పడుతుంటుంది. కొందరికి మోడలింగ్, కొందరికి బుల్లి తెర, కొందరికి నట వారసత్వం వరం అయితే మరి కొందరికి కేవలం అదృష్టం ఆ స్థాయి చేరుకోవటానికి సహకరిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర కథానాయికల్లో ఒకరైన సన్నీ లియోన్ కి ఇటువంటి బ్యాక్ గ్రౌండ్లు ఏవి లేవు. శృంగార చిత్రాల ద్వారా గుర్తింపు సంపాదించి ఆ గుర్తింపు తో బాలీవుడ్ కి ప్రవేశించింది సన్నీ లియోన్.

బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలకు కథానాయిక గా నటించినప్పటికీ సన్నీ లియోన్ అంటే పోర్న్ స్టార్ అనే ముద్ర చెరగటంలేదు. ఇటీవల నెటిజన్లు ఎక్కువ సెర్చ్ చేసిన సెలబ్రిటీస్ లిస్ట్ లో మొదటి స్థానం సంపాదించుకుంది సన్నీ లియోన్. వరుస బాలీవుడ్ అవకాశాలతో కెరీర్ అగ్ర పథంలో ఉన్నపటికీ సన్నీ తోటి కథానాయికలు ఆవిడని పోర్న్ స్టార్ గానే గుర్తిస్తుండటం సన్నీ ని తీవ్రంగా బాధిస్తుందిట. ఒక మీడియా ప్రతినిధికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో సన్నీ గతాన్ని ప్రస్తావించగా ఆవిడ నొచ్చుకుని కొంత ఆగ్రహానికి గురై సమాధానమిచ్చింది. :"కేవలం ప్రస్తుతానినే చిత్రీకరించి ఎవరి స్థాయి ఏంటో తేల్చితే నాతో పోటీకి కూడా సరిపడరు అని కొందరు కథానాయికలకు తెలుసు. అందుకే వారు పదే పదే నా గుర్తింపు మొత్తం గతానికి చెందింది అని నా అభిమానులను తప్పు దోవ పట్టించే విధంగా పని చేస్తున్నారు." అని ఇతర కథానాయికల పేర్లు ప్రస్తావించకుండానే తన సమకాలీన నటీమణుల పై మండి పడింది సన్నీ లియోన్.

Similar News