రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా విడుదలకు సిద్దమై పబ్లిసిటీ కార్యక్రమాల్లో తలమునకలుగా వున్న సమయం లో వారి ఫ్యామిలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ విషాదమేమంటే కమెడియన్ మరియు చిరంజీవి కి పిల్లనిచ్చిన మామగారు అయిన అల్లు రామలింగయ్య పెద్ద కూతురు భారతి మృతిచెందినట్లు భారతి అన్న, అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ ప్రకటించారు. అల్లు అరవింద్ కి, చిరంజీవి భార్య సురేఖ కి భారతి పెద్ద అక్కయ్య. అల్లు భారతి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ ఆమె ఈ రోజు తుదిశ్వాస విడిచారని సమాచారం. అనుకోకుండా ఆమె తనువు చాలించడంతో అల్లు ఫ్యామిలీ అంతా శోకసముద్రం లో మునిగిపోయింది.
ఇక రామ్ చరణ్, అల్లు అరవింద్ లు ధ్రువ పబ్లిసిటీ కార్యక్రమాలకు బ్రేక్ వేసి అల్లు భారతి అంతిమ యాత్రకు ఏర్పాట్లు జరుపుతున్నారని సమాచారం.