తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పాపులారిటీ అందరికి తెలిసిందే. పవర్ స్టార్ అభిమానులకు కూడా ఉత్సాహం బాగా ఎక్కువ అని పలు మెగా ఫామిలీ వేడుకలలో రోజు అవుతూనే వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కేవలం మెగా ఫామిలీ చిత్రాల వేడుకలకు కాకుండా ఇతర హీరోల చిత్రాల వేడుకలకు కూడా ఇదే రీతిలో పవన్ కళ్యాణ్ నినాదాలతో ప్రాజ్ఞాన్ని వేడెక్కించటంతో బాహుబలి చిత్ర ఆడియో వేడుక వేదిక పైన ప్రభాస్ చెప్పుకోలేని ఇబ్బందికి గురి కావటం అందరికి తెలిసిందే. ఈ పరిణామం సబబు కాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను వారించటానికి మెగా డాటర్ నిహారిక ఒక మనసు చిత్ర వేడుకను వేదికగా చేసుకుని పవన్ అభిమానులపై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు అల్లు అర్జున్. మెగా ఫామిలీ వేడుకలలో అయితే అంతా మనమే అని సర్దుకుపోతామని ఇతర హీరోల ప్రైవసీ దెబ్బతీసే విధంగా ప్రవర్తించటం అభిమానులతో పాటు పవర్ స్టార్ కి కూడా అపకీర్తి అని ఆవేశంతోనే వివరించాడు.
తాజాగా అనేక వివాదాల మధ్య రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి గీతావిష్కరణ విజయవాడ కే.ఎల్.యూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వారి ప్రవర్తన మార్చుకోకపోవటంతో కొంత అలజడికి కారణం అయ్యింది. వారు పదే పదే పవర్ స్టార్ నినాదాలతో వేదిక పై అతిథుల్ని ఇబ్బంది పెట్టటంతో చొరవ తీసుకున్న యాంకర్ ఝాన్సీ సహనం కోల్పోయి ఘాటుగానే వారించింది. ఎంతో దూరం నుంచి వచ్చిన అతిధుల సమక్షంలో వేడుక సజావుగా సాగే విధంగా సహకరించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. దానితో విసిగిన ఝాన్సీ పవర్ స్టార్ అంటే క్రమశిక్షణ అని అందరూ అనుకుంటారు. మరి ఆయన అభిమానులు ఇలా ప్రవర్తించటం హాస్యాస్పదం అని చేసిన వ్యాఖ్యతో పవర్ స్టార్ అభిమానులు ఝాన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం ప్రారంభించి వేడుకను మరింత రభస చేసారు.
నిన్న(శనివారం)టి నుంచి సోషల్ మీడియాలో యాంకర్ ఝాన్సీ ని ట్రోల్ చేస్తూ పలు పోస్ట్లు షేర్ చేసారు పవన్ కళ్యాణ్ అభిమానులు.