‘అమ్మ’తో అనుభూతులు నెమరేసుకున్న వర్మ

Update: 2016-12-07 20:36 GMT

సాధారణంగా ఎంతటి సహజసిద్ధమైన పరిణామాన్ని అయినా వివాదాస్పదంగా మార్చగలిగిన నైపుణ్యం కలిగిన దిట్ట రామ్ గోపాల్ వర్మ. ఆయన సినీ ప్రస్థానంలో సంచలనాలు సృష్టించిన శివ, గాయం, రంగీలా, సర్కార్, రక్త చరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ చిత్రాలకు ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ కంటే కూడా ఆయన ట్విట్టర్ లో తన వ్యక్తిగత అభిప్రాయాలను వివాదాస్పద రీతిలో వ్యక్తపరుస్తూ చేసిన ట్వీట్ల ద్వారా వచ్చిన ఫాలోయింగ్ చాలా ఎక్కువ అని అనటంలో అతిశయోక్తి లేదు. అటువంటి సంచలనాలకు మారు పేరు అయినా రామ్ గోపాల్ వర్మ తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత మరణంపై మాత్రం తన శైలికి విరుద్ధంగా స్పందించారు.

అమ్మ మరణం పై యావత్ దేశంలో చర్చ జరుగుతూ, తమిళనాడు రాష్ట్ర ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయిన తరుణంలో ఆర్.జి.వి తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలుపుతూ, "అమ్మ జయలలిత లేని తమిళనాడు రాష్ట్రాన్ని ఊహించుకోలేము. ఆవిడ రాజకీయ చాణక్యత మరెవరికి సాధ్యపడనిది. క్షణ క్షణం చిత్రానికి నాకు నంది పురస్కారం వచ్చిన అప్పుడు ఆ పురస్కారాన్ని నాటి ముఖ్య మంత్రిగా వున్న జయలలిత చేతుల మీదుగా అందుకున్నాను." అని ట్వీట్ చేస్తూ ఆ నాటి ఫోటో ను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసి తన ఫాలోయర్స్ తో పంచుకున్నారు రామ్ గోపాల్ వర్మ.

Similar News