యువ హీరో అల్లరి నరేష్ బాల్యం అంత తన తండ్రి ఈ.వి.వి.సత్యనారాయణ బిజీగా వరుస సినిమాలు చేసే దశలోనే గడిచిపోయింది. అప్పట్లో ఆయన మద్రాస్ లో నివాసం ఉండేవారు. దానితో ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ల స్కూలింగ్ మద్రాస్ లోనే ప్రాఆరంభం ఐయింది. చిన్న నాటి నుంచి విపరీతమైన అల్లరి చేసేవాడు అంట అల్లరి నరేష్. తొలి చిత్రం రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి కాక వేరే ఏదైనా చిత్రంతో పరిచయమైనా వ్యక్తిత్వ స్వభావాన్ని బట్టి పేరుకు ముందు అల్లరి కచ్చితంగా ఉండేదేమో అని కూడా తనను తానే చమత్కరించుకుంటున్నాడు అల్లరి నరేష్.
అల్లరి నరేష్ చేసే గల్లంతు భరించలేక ఇంటికి దూరంగా ఉంటే దారిలో పడతాడని భావించిన ఈ.వి.వి నరేష్ ని మద్రాస్ నుంచి హైద్రాబాద్ పంపించి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేరిపించారు అంట. ఆ హాస్టల్లో తన అనుభవాలు పంచుకుంటూ, "మద్రాస్ నుంచి హైద్రాబాద్ హాస్టల్ కి వచ్చినవెంటనే నాకు వాతావరణం నచ్చక ఇక్కడ వుండలేననిపించింది. దానితో నాన్న కి ఈ విషయం ఎలా అయినా చేరవేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిశ్చయించుకుని నాన్న కు ఒక లేఖ రాసాను. విద్యార్థులు ఎవరికీ లేఖ రాసింది ఏం రాసింది వివరాలు అన్నీ టీచర్స్ ముందుగా చూసి తరువాతే పోస్ట్ చేసేవారు. కానీ నా ఉత్తరాన్ని వారి కంట పడకుండా పంపాలని నా ప్రయత్నం. ఆ ఉత్తరంలో హాస్టల్ లో సరిగ్గా చూసుకోవటం లేదు. ఇక్కడ ఉండలేను, మీరు వచ్చి నన్ను తీసుకు వెళ్లకపోతే నేను ఇక్కడి నుంచి ఎటైనా పారిపోతాను అని రాసి ఆ ఉత్తరం రాజమండ్రిలో నాన్నగారు ఎప్పుడూ బస చేసే హోటల్ అడ్రెస్స్ కి రాసాను. అప్పుడు ఆయన 'అబ్బాయి గారు' చిత్రీకరణలో అక్కడ వున్నారు. ఇక ఆ ఉత్తరం ఎవరి కంట పడకుండా చేర్చితే నీకు మా నాన్న సినిమాలో అవకాశం కలిపిస్తానని ఆశ చూపి అటెండర్ ద్వారా ఆ ఉత్తరం పోస్ట్ చేపించాను. ఆ అటెండర్ కు సినిమాల పిచ్చి కొంచం ఎక్కువ. అతను చెప్పిన విధంగానే ఆ ఉత్తరాన్ని మా నాన్న గారికి చేర్చగా ఆయన వచ్చి నన్ను మళ్లీ మద్రాస్ కు తీసుకు వెళ్లిపోయారు. అక్కడ మళ్లీ నా పాత స్కూల్ పాత అల్లరి మామూలే." అంటూ తన బాల్య జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నాడు అల్లరి నరేష్.