Junior Ntr : తారక్ ను చూసి షాకవుతున్న ఫ్యాన్స్.. ఇంత కమిట్ మెంట్ అయితే ఎలా అంటూ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారకరామారావుకు అచ్చుగుద్దినట్లు ఉంటాడు. అందంలోనూ, అభినయంలోనూ తాను మించిన మనవడిగా ఇండ్రస్ట్రీలో తెచ్చుకున్నాడు. RRR మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన అభిమానులందరూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. తారక్ ప్రతి సినిమాకు మేకోవర్ అవుతుంటాడు. మూవీ పట్ల తారక్ కు ఉన్న కమిట్ మెంట్ అలాంటిది.
డ్రాగన్ సినిమాలో...
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమయింది. ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ తో వచ్చిన కు హై ఎక్స్ పెక్టేషన్స్ మూవీ అనౌన్స్ మెంట్ నుంచే వస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని బలంగా నమ్మకం ఏర్పడింది. ఇందుకోసం ప్రశాంత్ నీల్ ఎలా చెబితే అలా తయారయ్యేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా గత కొద్ది రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నాడు.
లేటెస్ట్ గా చూసిన వారు...
అయితే తారక్ ను లేటెస్ట్ గా చూసిన వారు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. మరీ సన్నగా తయారవ్వడంతో పాటు ముఖమంతా పీక్కుపోవడంతో ప్రశాంత్ నీల్ తమ అభిమాన హీరోను ఇలా తయారు చేశాడేంటన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా మొన్న కోట శ్రీనివాసరావు మృతితో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను చూసి ఇలా మేకోవర్ అయ్యాడేంటబ్బా అని ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. 1960 వ దశకంలో బెంగాల్ నేపథ్యంలో సాగే కథకు తగినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యాడంటున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.