ఆసక్తికరంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పేరుతో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న కొత్త బిల్లును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఆయన ఇంగ్లీషులో ట్వీట్లు పోస్ట్ చేస్తారు. కానీ పోస్టు మాత్రం తెలుగులోనే చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ రాజకీయ నేతలను ఉద్దేశించేనా?
ఏపీ రాజకీయ నేతలను ఉద్దేశించి ఈపోస్టు పెట్టారంటున్నారు. "మహాప్రభూ, ఓ చిలిపి సందేహం" అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌ను ప్రారంభించారు. కొత్తగా ప్రవేశపెట్టే బిల్లు వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అని సూటిగా ప్రశ్నించారు. మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారా? అని నిలదీశారు. అలాంటి వారిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఆ పదవిలో కూర్చోబెట్టే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రకాశ్ రాజ్ ఈ సందేహం వ్యక్తం చేశారు.