ప్రముఖ సినీ నటుడు ప్రభుకి అస్వస్థత
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరో రెండు, మూడు రోజుల..
actor prabhu hospitalized
ప్రముఖ తమిళ, తెలుగు సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. కడుపులో విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నై కొడంబాక్కంలోని మెడ్ వే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించి.. కిడ్నీలో రాళ్లున్నట్టు గుర్తించారు. అనంతరం లేజర్ సర్జరీ నిర్వహించి మూత్రపిండంలోని రాళ్లను తొలగించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉండే అవకాశం ఉంది. ప్రభు త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రభు తమిళ నటుడే అయినా.. తెలుగులోనూ ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన నటించిన చాలా సినిమా తెలుగులోకి డబ్ అయ్యాయి. చంద్రముఖి, పోలీసోడు, స్వామి, దరువు తదితర సినిమాల్లో నటించారు. ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలోనూ ఆయన కనిపించారు.