సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త మరణించారు
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త మరణించారు. ఆయన వయసు 95 ఏళ్లు. ఈరోజు ఉదయం ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శివశక్తి దత్త అనేక తెలుగు సినిమాలకు పాటలు అందించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ , కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఇద్దరు అన్నదమ్ములు.
శివశక్తి దత్త మృతి పట్ల...
కాగా శివశక్తి దత్త మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. కీరవాణి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. కాగా తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కీరవాణి RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డును సాధించారు.