Puri Jagannadh : పూరీ మూవీ కోసం వెయిటింగ్.. ఈసారి దంచుడు గ్యారంటీ అట
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. పూరి జగన్నాధ్ సినిమాలకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అభిమానులుగా ఉంటారు. ఆయన కథ.. కథనంతో పాటు టేకింగ్ ... కామెడీ.. సెంటిమెంట్.. లవ్.. ఇలా అన్నీ కలగలిపి ఒకే సినిమాలో షడ్రచులతో కావాల్సినంత విందును పెడతారని నమ్ముతారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా పూరి జగన్నాధ్ కు పెద్ద ఫ్యాన్ అని ఆయనే చెప్పుకున్నారు. పూరి జగన్నాధ్ ఫొటో కూడా ఆయన మొబైల్ లో ఉంటుంది. అలాగే అతి తక్కువ సమయంలో పూరి జగన్నాధ్ మూవీ తీస్తారు. అందుకే పూరీ అంటే ఇష్టపడని వారు ఇండ్రస్ట్రీలో అతి తక్కువ మంది ఉంటారు.
అరవై రోజుల్లోనే...
పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి సయితం పూరి జగన్నాధ్ నుంచి తాను నేర్చుకోవాల్సింది ఉంది అన్నారంటే పూరిలో ఉన్న స్పెషాలిటీ గురించి ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరస ఫ్లాప్ లు తగలొచ్చు. హిట్ లు రావచ్చు. పూరి జగన్నాధ్ లో ఆ నవ్వు మాత్రం మాయం కాదు. అలాగే నవ్వుతూ మరో మూవీకి ప్రిపేరవ్వడం పూరి జగన్నాధ్ ప్రత్యేకత. తాజాగా పూరి జగన్నాధ్ భారీ హిట్ తో కంబ్యాక్ కావాలని భావిస్తున్నాడు. అందుకోసం బెగ్గర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కూడా కేవలం అరవై రోజుల్లో అంటే రెండు నెలల్లో కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందు ఉంచుతానని పూరి జగన్నాధ్ ఇప్పటికే ప్రకటించి సంచలనం సృష్టించాడు.
తాజాగా కన్నడ నటుడిని...
బెగ్గర్ మూవీలో విజయ్ సేతుపతిని హీరోగా ఎంచుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీభాషల్లో ఒకేసారి తెరకెక్కించేందుకు పూరి జగన్నాధ్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతిని ఎంచుకోవడమే పూరి ప్రత్యేకత. దీంతో పాటు సీనియర్ నటి టబూను కూడా తన మూవీలో ప్రత్యేక పాత్రలో చపించబోతున్నారు. మరో కన్నడ స్టార్ ను కూడా ఈ చిత్రం కోసం తీసుకున్నారన్నది సినీ పరిశ్రమ వర్గాల టాక్. విజయ్ సేతుపతితో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నాడు. తమిళం, కన్నడ స్టార్స్ తలపడుతుంటే స్క్రీన్ మీద చూసినోళ్లకు చూసినంత. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయి ఆగస్టు లేదా సెప్టంబరు నెలలో విడుదలకు పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నారు.