తెలుగు చిత్రపరిశ్రమలో ఊహించని విషాదం

తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి.మహేశ్

Update: 2024-02-25 12:52 GMT

తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి.మహేశ్ మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంట్లోని బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కాలుజారి పడ్డారు. దీంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని కొరుటూరు నిర్మాత మహేశ్ సొంతూరు. ఈయన అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ చెప్పారు. మహేష్ పెళ్లి చేసుకోలేదు.

1975లో 'మాతృమూర్తి' సినిమాతో వి.మహేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ 'మనుష్యులంతా ఒక్కటే', 'మహాపురుషుడు', చిరంజీవి 'సింహపురి సింహం', సుమన్ 'ముసుగు దొంగ' లాంటి చిత్రాలను నిర్మించారు. మనుష్యులంతా ఒక్కటే సినిమాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రసారమైన 'హరి భక్తుల కథలు' సీరియల్‌కి ప్రొడ్యూసర్, రైటర్‌గానూ పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News