Vishal : విశాల్ కు తీవ్ర అస్వస్థత.. స్టేజీ పైనే కుప్పకూలి

తమిళ సినీ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఒక కార్యక్రమంలో వేదికపై స్పృహ తప్పి పడిపోయారు

Update: 2025-05-12 02:09 GMT

తమిళ సినీ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఒక కార్యక్రమంలో వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఇటీవల డెంగ్యూ వ్యాధితో విశాల్ కొద్దిరోజుల పాటు ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు నీరసంగా కనిపించారు. తాజాగా తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాగంలోని కూత్తాండవర్ ఆలయంలో జరుగుతున్న చిత్తిరై వేడుకల్లో విశాల్ స్పృహ తప్పి కింద పడిపోయారు.

మిస్ కూవాగం పోటీలలో...
ట్రాన్స్ జెండర్లకు మిస్ కూవాగం 2025 పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విశాల్ వేదికపైనే స్పృహ తప్పి కింద పడి పోవడంతో అందరూ కంగారు పడ్డారు. వెంటనే విశాల్ ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఇటీవల మద గజ రాజా సినిమా ప్రమోషన్స్ లోనూ ఆయన స్పృహ తప్పి కింద పడి పోయారు. అప్పుడు డెంగ్యూ చికిత్స పొంది రావడంతో నీరసంతో ఉన్నారని చెప్పారు. మరి ఇప్పుడు ఏమయిందన్నది అభిమానుల్లో ఆందోళనగా ఉంది.


Tags:    

Similar News