Tollywood : నేటి నుంచి షూటింగ్ లు ప్రారంభం
గత పద్దెనిమిదిరోజులుగా టాలీవుడ్ లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. నేటి నుంచి షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి
గత పద్దెనిమిదిరోజులుగా టాలీవుడ్ లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. నేటి నుంచి షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి. కార్మికులకు సంబంధించిన వేతనాలతో పాటుఇతర అంశాలపై కార్మిక సంఘాలకు, నిర్మాతలకు మధ్య అంగీకారం కుదరడంతో సమ్మెకు తెరపడింది. 30 వేతనాలను పెంచాలని కార్మికులు గత పద్దెనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సమ్మెకు పరిష్కారం చూపాలని కార్మిక సంఘ కమిషనర్ ను ఆదేశించారు.
చర్చలు సఫలం కావడంతో...
దీంతో కార్మిక శాఖతో పాటు ఎఫ్.డి.సి ఛైర్మన్ కలసి నిర్మాతలు, చలన చిత్ర మండలికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రోజుకు రెండు వేల రూపాయల వేతనం పొందుతున్న వారికి మూడేళ్లలో దశలవారీగా 2.5 శాతం, రెండు నుంచి ఐదు వేల రూపాయల వరకూ వేతనాలు పొందుతున్న కార్మికులకు 17.5 శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. అలాగే నిర్మాతలు షూటింగ్ సమయంలో పెట్టిన కండిషన్స్ కు కూడా కార్మిక సంఘాలు ఒప్పుకోవడంతో సమ్మెకు తెరపడింది. దీంతో నేటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తిరిగి షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి.